- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధి పనులను ప్రారంభించిన గంప గోవర్ధన్.. తలమడ్ల, ఆరెపల్లెను పాత మండలంలోనే కలపాలని కోరిన గ్రామ ప్రజలు
దిశ, రాజంపేట: రాజంపేట మండలంలోని తలమడ్ల గ్రామంలో రైతు వేదిక భవనం, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, వైకుంఠధామం, సీసీ రోడ్లను, వివిధ అభివృద్ధి పనులను బుధవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. అనంతరం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో తలమడ్ల, ఆరెపల్లి గ్రామాల ప్రజా ప్రతినిధులు మా రెండు గ్రామాలను తిరిగి పాత మండలమైన బిక్నూరులోని కలపాలని వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. కొత్త మండలమైన రాజంపేటలో కలుస్తామని నాకు తెలియకుండానే మీ గ్రామాలలోనే తీర్మానాలు చేసుకొని మీరే అర్జీలు ఇచ్చారు. ఇపుడేమో ఆకస్మాతుగా పాత మండలంలో కలుస్తామని అంటున్నారు. ఇది దాదాపు సాధ్యమైయ్యే పని కాదని, మీ అందరి కోరిక మేరకు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకవేళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదవ రెడ్డి, ఎంపీపీ లింగాల స్వరూప, జెడ్పిటిసీ కొండా హనుమాన్లు, ఎంపీటీసీ నర్మాల రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, మండల తెరాస అధ్యక్షుడు బిక్కాజి బలవంతరావు, నాయకులు జూకంటి మోహన్ రెడ్డి, నల్లవెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Also Read....
Gujarat , హిమాచల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. గెలుపుపై ఎవరి ధీమా వారిదే!