నీళ్లు తాగడమే మానేశాం.."దిశ" వార్త హల్ చల్..

by Sumithra |
నీళ్లు తాగడమే మానేశాం..దిశ వార్త హల్ చల్..
X

దిశ, భిక్కనూరు : చెరువులో నీళ్లు నల్లబడిపోయాయి... అప్పట్లో లక్షల రూపాయల విలువ చేసే చేపలు మృత్యువాత పడ్డాయి. అప్పటినుంచి బోర్లు, కుళాయిల ద్వారా సరఫరా అయ్యే నీళ్లు తాగడం మానేశారు. భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలోని సబ్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న రైతులతో పాటు, ఆ ప్రాంతంలో కూలి నాళీ చేసుకునేందుకు వెళ్లే పనివారు సైతం తాగడం బంద్ చేశారు. మినరల్ వాటర్ బబుల్స్ వేయించుకొని, ఇంటినుండే బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు తప్ప, వ్యవసాయ బావుల వద్ద గాని, ఆ ప్రాంతంలో ఉన్న కుళాయిల ద్వారా వచ్చే నీళ్లను మాత్రం మునుపటి మాదిరిగా వినియోగించుకోలేకపోతున్నారు. రసాయనిక పరిశ్రమ ద్వారా వచ్చే వ్యర్థాలు, కలుషితమైన నీళ్లు చెరువులో చేరడం వలన పెద్ద చెరువులో చేపలు మరణించాయి.

పైగా బోరు మోటార్ల ద్వారా వచ్చే నీళ్లు సైతం సమర్ గా ఉండడం, టేస్ట్ మారిపోవడం వలన, తెలియక ఆ నీళ్లు తాగిన కొందరు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని గ్రామాన్ని సందర్శించిన "దిశ"తో చెప్పుకొని కొందరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నిరోజులుగా కుళాయిల ద్వారా కొన్ని ప్రాంతాల్లో కలుషితమైన నీళ్లు వస్తున్నా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలోని నీటి తొట్టి వద్ద నుంచి ఇదివరకు మంచినీళ్లు పట్టుకునేందుకు పోటీపడేవారని, ప్రస్తుతం అక్కడ నీళ్లు పట్టుకోవడం చాలామంది మానుకున్నారని కూడా వివరించారు. గ్రామస్తుల కొందరు ఈ విధంగా చెబితే, గ్రామానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు మాత్రంనీళ్లు కలుషితం కావడం లేదని, ఇనుప పైపులు తుప్పు పట్టాయని, తద్వారా నీళ్లు చిలుము పట్టి కొద్దిసేపు రంగు నీళ్లు గా మారి సబ్ స్టేషన్ లో ఉన్న కుళాయిలో సరఫరా అయ్యాయని బుకాయించడం కొసమెరుపు.

వార్త హల్ చల్ ...

ఆ రంగు నీళ్లు తాగేదెట్టా... అన్న శీర్షికన" దిశ" జిల్లా ఎడిషన్ లో వచ్చిన వార్త హల్ చల్ అయ్యింది. గ్రామంలోని వాట్సాప్ గ్రూపు లతోపాటు, మండలంలోని వివిధ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వార్తను స్టేటస్ గా చాలామంది పెట్టుకోవడంతోపాటు, పలు గ్రూపుల్లో పోస్టు పెట్టడంతో గిరికలు కొడుతోంది. ఇకనైనా జాగ్రత్త పడాలని, ప్రజలారా కనువిప్పు కలగాలని కొటేషన్లు పెట్టడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed