ఎనిమిది నెలలుగా జీతాలు లేవు.. మేమెట్లా బతికేది..

by Sumithra |
ఎనిమిది నెలలుగా జీతాలు లేవు.. మేమెట్లా బతికేది..
X

దిశ, తాడ్వాయి : గ్రామ పంచాయతీ కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వాలంటూ రాజంపేట్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రాజేశంకు శుక్రవారం గ్రామపంచాయతీ కార్మికులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కారోబార్ మండల సెక్రటరీ నరేష్ మాట్లాడుతూ ఎనిమిది నెలలుగా జీతాలు లేవు.. మేమెట్లా బతికేది.. మాపై ప్రభుత్వం ఎందుకు కక్షగట్టింది.. అందరి ఉద్యోగులకు ఇచ్చినట్టు మాకు కూడా నెలనెలా వేతనాలు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు.

సూరీడు పొడవక ముందే ఇంటింటా తిరుగుతూ చెత్తబండి వచ్చిందమ్మా… తడిపొడిచెత్త వేరుచేసి ఇవ్వండమ్మా… అంటూ గ్రామంలో తిరుగుతూ ఊరును శుభ్రం చేస్తున్న సఫాయి కార్మికుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయన్నారు. పొద్దంతా కూలిపని చేసి వచ్చిన డబ్బులతో పూట గడుపుకొనే ఈ రోజుల్లో ఎనిమిది నెలులుగా మాకు జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే విధులకు హాజరుకాలేమని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story