- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో నాగ చైతన్య
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆర్ కారణమని,.. ఎన్ కన్వెన్షన్ హాల్‌ను కూల్చొద్దంటే సమంతను కేటీఆర్ తన దగ్గరికి పంపాలని డిమాండ్ చేశాడని. కేటీఆర్ డిమాండ్ మేరకు సమంతను అతని వద్దకు వెళ్లాలని నాగార్జున వాళ్ళు ఒత్తిడి చేశారని.. ఈ క్రమంలో సమంత కేటీఆర్ వద్దకు వెళ్ళనంటూ నిరాకరించడంతో తాము చెప్పింది వినకపోతే ఇంటి నుంచి వెళ్ళిపొమ్మని చెప్పి ఆమెకు విడాకులు ఇచ్చారని ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యాఖ్యలపై హీరో నాగార్జున, సమంత, కేటీఆర్ స్పందించి.. మంత్రి వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా ఈ ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ వ్యవహారంపై నాగ చైతన్య కూడా స్పందించారు. కాగా అతను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ.. తన తండ్రి నాగార్జున చేసిన ట్వీట్ నే రీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కొండా సురేఖ వ్యాఖ్యలతో దుమారం రేగగా.. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం ట్రెండింగ్‌లో కొనసాగుతుంది.
Also Read...