- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SBI: మూడోరోజూ కొనసాగిన ఎస్‌బీఐ సర్వర్ డౌన్ సమస్య
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఆన్‌లైన్ కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత మూడు రోజుల నుంచి ఎస్‌బీఐ సర్వర్లు డౌన్ కావడంతో లక్షలాది మంది కస్టమర్లు లావాదేవీలు చేయలేకపోయారు. ముఖ్యంగా నగదు బదిలీ చేసిన సమయంలోఇతర ఖాతాలకు చేరడం లేదని వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఔటేజ్ ట్రాకర్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. మంగళవారం రోజంతా వినియోగారులు ఆన్‌లైన్ లావాదేవీల్లో అంతరాయాలను ఎదుర్కొన్నారు. బుధవారం ఉదయం కూడా సుమారు 1,500 మందికి పైగా వినియోగదారులు సోషల్ మీడియా ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలపై ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఎస్‌బీఐకి చెందిన నెట్ బ్యాంకింగ్, యూపీఐల ద్వారా నగదును బదిలీ చేయలేకపోయారు. అంతేకాకుండా గూగుల్ పే వంటి ప్లాట్‌ఫామ్‌లలో బ్యాలెన్స్ చూసేందుకు కూడా వీలు కాలేదు. చాలామంది కస్టమర్లు 'బ్యాంక్ నెట్‌వర్క్ డౌన్ ' అనే మెసేజ్‌ను అందుకున్నారు. అయితే, దీనిపై ఎస్‌బీఐ అధికారికంగా స్పందించాల్సి ఉంది. బుధవారం మధ్యాహ్నం తర్వాత అంతరాయం తగ్గినప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్రక్రియలో ఇబ్బందులు కొనసాగాయి. వినియోగదారులు సోషల్ మీడియా ద్వారా తమ నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు.