- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై భగ్గుమన్న రోజా.. అది దుర్మార్గమంటూ ఫైర్
దిశ, వెబ్ డెస్క్: హీరో అక్కినేని నాగార్జున కుటుంబం(Hero Akkineni Nagarjuna family)పై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి రోజా(Former Minister of AP Roja) ఆగ్రహం వ్యక్తం చేశారు. నటి సమంత(Actress Samantha)పై కొండా సురేఖ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని, తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె మండిపడ్డారు. కొండా సురేఖపై బీఆర్ఎస్ పార్టీ (Brs Party) అనుయాయలు చేసిన పోస్టులను సమాజం వ్యతిరేకించిందని రోజా చెప్పారు. ఆ సందర్భంగా తీవ్ర వేదనకు గురి అయిన కొండా సురేఖ అంత కన్నా హేయమైన వ్యాఖ్యలను తోటి మహిళపై చేయడానికి మనస్సు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళను తీసుకురావడం దుర్మార్గమని, ఆ పని మహిలే చేయటం మరింత బాధిస్తోందని చెప్పారు. ఇలాంటి వేదనాభరిత పరిస్థితి నుంచి అక్కినేని నాగార్జున కుటుంబం, సమంత మనో ధైర్యంతో అధిగమిస్తుందని తాను ఆశిస్తున్నానని మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం పై ప్రత్యేకించి సమంతా పై చేసిన జుగుప్షకర వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కొండా సురేఖ పై @BRSparty అనుయాయలు చేసిన పోస్టులను సమాజం వ్యతిరేకించింది. ఆ సందర్భంగా తీవ్ర వేదనకు గురి అయిన @iamkondasurekha అంత కన్నా హేయమైన వ్యాఖ్యలను…
— Roja Selvamani (@RojaSelvamaniRK) October 2, 2024
Also Read...