- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కినేని ఇంటికి కాబోయే కోడలి అసలు పేరు ఏంటో తెలుసా.. వెడ్డింగ్ కార్డులో బయటపడ్డ షాకింగ్ నిజం..?
దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య సమంతతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభితతో డేటింగ్‌లో ఉంటూ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున X వేదికగా ప్రకటిస్తూ వీరిద్దరి నిశ్చితార్ధ ఫొటోలను షేర్ చేశాడు. కానీ పెళ్లి డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. దీంతో చై- శోభితల మ్యారేజ్ ఎప్పుడెప్పుడు అవుతదా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సమయంలో శోభిత పసుపు దంచుట కార్యక్రమం అంటూ కొన్ని ఫొటోలు షేర్ చేయడమే కాకుండా పెళ్ళిపై హింట్ కూడా ఇచ్చేసింది. ఇక వీరి వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో అట్టహాసంగా జరగనున్నట్లు ఓ ఇన్విటేషన్ కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ పెళ్లి పత్రిలో ఓ షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే..?
ఇప్పటివరకు మనందరికీ శోభిత పేరు శోభిత ధూళిపాళ అనే తెలుసు కానీ, పెళ్లి కార్డులో ఈమె అసలు పేరు ఏంటో తెలిసిపోయింది. ఇక వైరల్ అవుతున్న పెళ్లి కార్డును ఒక సారి పరిశీలించినట్లయితే దీనిలో అక్కినేని నాగేశ్వరరావు- అన్నపూర్ణ.. దగ్గుబాటి రామానాయుడు- రాజేశ్వరి మనవడు అయిన నాగ చైతన్యకు ధూళిపాళ శాంత కామక్షీ- వేణుగోపాల్ రావు కుమార్తె అయిన లక్ష్మీ శోభితాతో డిసెంబర్ 4 న అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం జరగనుంది అని రాసుకొచ్చారు. అయితే శోభితా పూర్తి పేరు లక్ష్మీ శోభితా అన్న విషయం ఎవరికీ తెలియదు. మరి అది అసలు పేరా..? లేక చై.. తన అమ్మగారి పేరును శోభితా పేరుకు ముందు పెట్టుకున్నాడా..? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్‌గా మారింది.