కష్టపడింది రెండు ఉద్యోగాలు సాధించింది.. చాలా రోజులకు మహిళ ఉద్యోగి ఎంపిక...

by Sumithra |
కష్టపడింది రెండు ఉద్యోగాలు సాధించింది.. చాలా రోజులకు మహిళ ఉద్యోగి ఎంపిక...
X

దిశ, ఎల్లారెడ్డి పేట : తొలి ప్రయత్నంలోనే రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి మండలంలోని యువతులకు ఆదర్శంగా నిలిచింది పొన్నం సింధు. ఎల్లారెడ్డి పేటలో సుమారు గత ఎనిమిది సంవత్సరాల నుండి ఒక్క మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కాకపోగా తాజాగా వెలువడిన గ్రూప్ - 4 ఫలితాల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించి మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచింది.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గత 20 సంవత్సరాలుగా స్థిరపడి నివాసముంటున్న పొన్నం ఎల్లయ్య - పద్మ దంపతుల కూతురు సింధు కష్టపడి చదివి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో ఆమెను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ వెంకట్ నరసింహ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్, గౌడ సంఘం మండల అధ్యక్షులు గంట కార్తీక్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు బుచ్చిలింగు సంతోష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు మెండే శ్రీనివాస్ యాదవ్ బండారి బాల్ రెడ్డిలు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింధు గ్రూప్ - 4 తో పాటు బ్యాంకు ఉద్యోగం పొందారన్నారు. కష్టపడి ఇష్టంతో చదివి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని పిలుపునిచ్చారు. సింధు తన ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు.

Advertisement

Next Story

Most Viewed