Pushpa 2 : ట్రైలర్ ఈవెంట్ తో కూడా రికార్డు క్రియోట్ చేసిన అల్లు అర్జున్

by Prasanna |
Pushpa 2 : ట్రైలర్ ఈవెంట్ తో కూడా రికార్డు క్రియోట్ చేసిన అల్లు అర్జున్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ( Allu Arjun) తెరకెక్కిన మూవీ పుష్ప 2 ( pushpa 2) ఈ మూవీ ట్రైలర్ ఆదివారం సాయంత్రం రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో తెలుగు ట్రైలర్ మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తుంది. బీహార్, పాట్నాలో ఈ ఈవెంట్ కి నేషనల్ క్రష్ రష్మిక, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు.

అయితే, లక్షల మంది ఈ ఈవెంట్ కు రావడంతో రికార్డు క్రియోట్ చేసింది. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లైవ్ ను రెండు లక్షల మందికి పైగా చూసారని ఓ పోస్ట్ ను విడుదల చేశారు. ఇండియాలో ఇప్పటి వరకు ఏ మూవీ ఈవెంట్ లైవ్ ను కూడా ఇంత మంది జనాలు చూడలేదు. టాలీవుడ్ లో ఏ మూవీ ఈవెంట్ లైవ్ ను ఇంత భారీ మొత్తంలో చూసింది కూడా లేదు. కానీ పుష్ప 2 ఈ ఘనత కూడా సాధించింది.

ఇక ఈ ఈవెంట్ కి పెద్ద ఎత్తున ఫ్యాన్స్, జనాలు హాజరవ్వడంతో పోలీసులు, సెక్యూరిటీ ని ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్, రష్మిక ( Rashmika Mandanna) జోడిగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది.

Advertisement

Next Story