కాంగ్రెస్ పార్టీవి వారెంటీ లేని ఆరు గ్యారెంటీలు

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ పార్టీవి వారెంటీ లేని ఆరు గ్యారెంటీలు
X

దిశ, నాగిరెడ్డిపేట్ : కాంగ్రెస్ పార్టీవి వారెంటీ లేని ఆరు గ్యారెంటీలు అని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మోసపు మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే వంద రోజులు దాటినా అమలు చేయలేదని, త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో రామాలయం నుండి బస్టాండ్ వరకు నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. రైతులకు రుణమాఫీ, అందరికీ రైతుబంధు, మహిళలకు నెలకు రూ.2,500 ఎటు పోయాయని ప్రశ్నించారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం సాగునీటిని అందించలేకపోతున్నదని, ప్రభుత్వ అన్ని పంటలకు

క్వింటాలుకు రూ.500 బోనస్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. హరీష్ రావు చేసిన సవాల్ తక్షణమే స్వీకరించి ఆగస్టు 15 లోపు 40 వేల కోట్ల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నారు. చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని డిమాండ్ చేశారు. వీటన్నింటిపై గ్రామాల్లో కార్యకర్తలు చర్చ పెట్టాలని, రైతులకు, మహిళలకు కాంగ్రెస్‌ మోసపు హామీలను విడమరిచి చెప్పాలని సూచించారు. పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలంటే జహీరాబాద్ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి, మండల అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, నాయకులు వెంకట్ రెడ్డి, సంతోష్ గౌడ్, దుర్గారెడ్డి, మోతె శ్రీనివాస్, మంగలి యాదగిరి, బాబురావు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed