ఆ బార్‌‌‌లో బీరుతోపాటు అమ్మాయిల టచ్.. ఖర్చు ఎక్కువైనా క్యూ కడుతున్న జనం.. అసలు సీక్రెట్ ఏంటంటే..

by Dishafeatures3 |
ఆ బార్‌‌‌లో బీరుతోపాటు అమ్మాయిల టచ్.. ఖర్చు ఎక్కువైనా క్యూ కడుతున్న జనం.. అసలు సీక్రెట్ ఏంటంటే..
X

దిశ, ఫీచర్స్ : హార్ట్ హర్ట్ అయినప్పుడు కాళ్లు బార్ వైపు పరుగెడుతాయి. కాస్త ప్రశాంతత దొరికేది అక్కడే అని బ్రెయిన్ కూడా సిగ్నల్ ఇస్తది. దీంతో చేతిలో నయా పైసా లేకపోయినా అప్పు చేసి మరీ అక్కడికి పరుగెడుతారు. కడుపు నిండా తాగి సోయి లేకుండా పడుకోవచ్చని ప్లాన్ చేస్తారు. కానీ ఇంటికి వచ్చేదాకా కాకుండా బీరు ఎక్కువై బార్ లోనే పడిపోయారు అనుకోండి.. తన్ని తరిమేసే పరిస్థితి రావచ్చు. అయితే ఇంత గౌరవం లేకుండా ఆ పని చేసుడు ఎందుకులే అనుకుందో లేక ఇక్కడికి వచ్చినోడిని ఫ్రీగా బయటకు పంపించుడు ఎందుకని నిర్ణయించుకుందో తెలియదు కానీ ఈ బార్ కాస్త డిఫరెంట్ గా ట్రై చేసింది. తాగి పడిపోయిన వాళ్ళను లేపేందుకు చెంప దెబ్బ ఆఫర్ చేస్తుంది.

అవును జపాన్ నగోయలోని Shachihoko-ya izakaya బార్ అమ్మాయిలతో చెంప దెబ్బలను స్నాక్స్ లా సర్వీస్ కింద ఇస్తుంది. ఒక్క స్లాప్ కు ఐదు వందలు కూడా వసూల్ చేస్తుంది. ఆ ఆఫర్ పై మొదట్లో వ్యతిరేకత వచ్చినా మొత్తానికి ట్రెండ్ అయింది. దీంతో చాలా మంది ఈ పెయిన్ ఫుల్ దెబ్బని ట్రై చేసేందుకు కారణం అవుతుంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట ట్రెండ్ అవుతుండగా.. ఆఫర్ అదిరిపోయిందని కామెంట్స్ వస్తున్నాయి. కానీ దీనిపై విమర్శలు కూడా లేకపోలేదు. ఇలా ఒకరిని వేధించడం నేరమే అని తిట్టిపోస్తున్నరు.

Read More...

మీరు తాగే టీలో చిటికెడు ఈ పదార్ధాన్ని కలిపి తీసుకుంటే.. మెడిసిన్స్ అవసరం లేదు

Next Story

Most Viewed