- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ట్రాఫిక్ పోలీసే రూల్స్ బ్రేక్ చేస్తే ఎలా? రైల్వే గేట్ పడిన బండి దాటించాడు (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తుంటారు. నిబంధనలు పాటించని వారిపై ట్రాఫిక్ పోలీసులు జరిమానా, చర్యలు తీసుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ రూల్స్ పాటించాలని చెప్పే పోలీసులే రూల్స్ బ్రేక్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ట్రాఫిక్ పోలీస్ అధికారి రెడ్ సిగ్నల్ పడి ఉన్న రైల్వే గేటు వద్ద ప్రమాదకరంగా బైక్‌తో పట్టాలు దాటుతున్నాడు. ఉత్తర ప్రదేశ్ లక్నోలోని దిల్ కుషా రైల్వే గేట్ వద్ద.. రైలు వస్తుండడంతో గేటు వేశారు.
ఈ క్రమంలోనే వాహనదారులందరూ గేటు వద్ద ఆగారు. అటువైపుగా వస్తున్న ఓ ట్రాఫిక్ పోలీస్ మాత్రం ఆగకుండా ప్రమాదకరంగా రైల్వే గేట్ కింద నుంచి బండి తోసుకుంటూ వెళ్లిపోయాడు. ఆ అధికారిని చూసి మరో సాధారణ వ్యక్తి అలాగే చేశాడు. దీంతో పోలీస్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఒక ఐదు నిమిషాలు ఆగలేరా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో యూపీ పోలీస్ అధికారులు స్పందించారు. ఈ విషయంపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు.