- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్నస్వామి స్టేడియంలో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
దిశ, వెబ్‌డెస్క్: భారత్ లో 2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా విజయవంతంగా 17 సీజన్లను పూర్తి చేసుకుంది. కాగా ఈ 17 సీజన్లలోను విరాట్ కోహ్లీ ఆర్సీబీ జట్టు తరపున ఆడుతూనే ఉన్నాడు. దీంతో ఆ జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉంటే ఆర్సీబీ జట్టు హోం గ్రౌండ్ గా చిన్నస్వామి స్టేడియం ఉంటుంది. ఈ గ్రౌండ్ బ్యాటర్లకు స్వర్గధామంలా ఉంటుంది. సిక్సర్లు నిలయంగా కూడా పేరుంది. అలాంటి ఈ గ్రౌండ్ లో కోహ్లీ అత్యధిక మ్యాచ్లు ఆడాడు. ఈ క్రమంలో కొహ్లీ చిన్నస్వామి స్టేడియంలో రికార్డులను బద్దలు కొట్టాడు. మొత్తం ఐపీఎల్ సీజన్లలో కలిపి ఒకే వేదికలో 3000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక ప్లేయర్ గా కోహ్లీ నిలిచాడు. ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ ముంబై జట్టు నుంచి తమ హోం గ్రౌండ్ లో 2295 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే డివిలియర్స్ చిన్నస్వామి స్టేడియంలో 1960 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అలాగే ఈ మ్యాచులో 40 పరుగులతో ఆడుతున్న కోహ్లీ టీ20 కెరిర్‌లో 9000 పరుగులను పూర్తి చేసుకున్నాడు.