- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ చేసిన అన్యాయాలను బీజేపీ సరిదిద్దింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయానికి దేశంలో అనేక సమస్యలు ఉండేవని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో అనేక అవినీతి, కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. దేశంలో అవినీతిరహిత ప్రభుత్వం ఉండాలని 2014 లో ప్రజలు మోడీని నాయకుడిగా ఎన్నుకున్నారని అన్నారు. ఈ పదేళ్లలో కాంగ్రెస్ చేసిన అవినీతి, అక్రమాలు, బందుప్రీతిని బీజేపీ సరిదిద్దిందని అన్నారు. ప్రపంచ దేశాలను భారత్‌వైపు చూసేలా అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు.
దీంతో ఇప్పుడు మూడోసారి ప్రజలు మోడీని ఆశీర్వదించేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. చిన్న అవినీతి మరక కూడా లేకుండా బీజేపీ దేశాన్ని పదేళ్లు పాలించిందని అన్నారు. ఉగ్రదాడులు, మతకలహాలు లేకుండా సాఫీగా సాగిపోయిందని తెలిపారు. మొత్తం దేశంలో శాంతి నెలకొందని వెల్లడించారు. ప్రపంచం ముందు పాకిస్తాన్‌ను దోషి నిలబెట్టడంలో సక్సెస్ అయ్యామని అన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ తినడానికి తిండి లేక భిక్షమెత్తుకుంటోందని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో రహదారులను నిర్మిస్తున్నట్లు చెప్పారు. రూ.1.02 లక్షల కోట్లతో తెలంగాణలో రహదారులు నిర్మించినట్లు తెలిపారు. ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించిందని అన్నారు.