సేల్స్ టాక్స్ ఆఫీసర్లు గా రిపోర్టర్ల అక్రమ వసూళ్లు

by Disha Web Desk 12 |
సేల్స్ టాక్స్ ఆఫీసర్లు గా రిపోర్టర్ల అక్రమ వసూళ్లు
X

దిశ, గాంధారి: తాము విలేకరులమని, అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించిన సంఘటన సదాశివనగర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, ట్రైనీ ఐపీఎస్ కాజల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. పెర్కిట్ గ్రామానికి చెందిన నిఖిల్ శుక్రవారం (నిన్న) అర్ధరాత్రి ఒకటి గంటల ప్రాంతంలో అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనం నందు అతని యొక్క సామాను తీసుకుని వెళుతుండగా మల్లుపేట్ ఎన్ హెచ్ 44 పై గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కార్లో వచ్చి వాహనాన్ని ఆపి మేము సేల్స్ టాక్స్ డిపార్ట్మెంట్ వారని అంతేకాకుండా రిపోర్టర్ల మని వాహనంలో గూడ్స్ యొక్క డాక్యుమెంట్స్ చూపించమని అడిగి 25000 డిమాండ్ చేశారని, అడిగిన డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించడం జరిగిందని డి.ఎస్.పి తెలిపారు.

దీనిపై సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదు కాగా నిందితులను పట్టుకొని వారి వద్ద నుండి ఒక కారు ఆరు మొబైల్ ఫోన్స్ నగదును సీజ్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఎవరైనా పాల్పడిన వారిని అరెస్టు చేసి సాక్షాధారాలతో కోర్టులో శిక్షపడేలా చేస్తామని తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి కేసు చేదించి నిందితులను పట్టుకున్న సహస్ర నగర్ సిఐ సంతోష్ కుమార్, ఎస్సై రాజు, పోలీస్ సిబ్బందిని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ, ఎల్లారెడ్డి డి.ఎస్.పి శ్రీనివాసులు అభినందించడం జరిగింది.

Next Story

Most Viewed