తెలంగాణలో బీజేపీకి పది ఎంపీ సీట్లు పక్కా: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

by Satheesh |
తెలంగాణలో బీజేపీకి పది ఎంపీ సీట్లు పక్కా: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పది ఎంపీ సీట్లు రావడం పక్కా అని బీజేఏల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం శనివారం ఆయన చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్‌లో లక్ష మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. వరంగల్, భువనగిరి, జహీరాబాద్‌లో చాలా క్లోజ్ కంటెస్ట్ ఉందని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ గెలిచే లిస్టులో ఉన్నా.. తక్కువ మెజారిటీతో అయినా తామే గెలుస్తున్నట్లు జోస్యం చెప్పారు. మెదక్‌లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉందని ఏలేటి వివరించారు. మెదక్ మినహా మిగతా చోట్ల బీఆర్ఎస్‌కు మూడో స్థానమేనని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed