Narakasura Vadha: ముచ్చింతల్ సమతా మూర్తి ప్రాంగణంలో దీపావళి వేడుకలు

by Rani Yarlagadda |   ( Updated:2024-10-31 02:29:42.0  )
Narakasura Vadha: ముచ్చింతల్ సమతా మూర్తి ప్రాంగణంలో దీపావళి వేడుకలు
X

దిశ, వెబ్ డెస్క్: దేశమంతా దీపావళి శోభ నెలకొంది. ఊరు, వాడలన్నీ నగరాల నుంచి పండుగకు వెళ్లిన వారితో కళకళలాడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ సమతామూర్తి (Muchintal Samatha Murthy) ప్రాంగణంలో దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. నరకాసురవధ కోసం 30 అడుగుల భారీ నరకాసుర ప్రతిమను ఏర్పాటు చేయగా.. దానిని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

ఈ సందర్భంగా చినజీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటామని పేర్కొన్నారు. నరకాసురుడు దుష్ట గుణాలకు ప్రతీక అని, ప్రజలంతా దుర్గుణాలను వదిలి సత్ బుద్ధి కలగాలనే నరకాసుర వధ చేస్తామని తెలిపారు. నరకాసుర వధతో ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆశిస్తున్నట్లు చినజీయర్ స్వామి వెల్లడించారు.

Advertisement

Next Story