- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Trump Net Worth : డొనాల్డ్ ట్రంప్ ‘సంపద’ డబుల్.. కారణం ఇదీ
దిశ, నేషనల్ బ్యూరో : ఈనెల(అక్టోబరు)లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నికర సంపద అకస్మాత్తుగా డబుల్ అయింది. అది రూ.33వేల కోట్ల నుంచి రూ.67వేల కోట్లకు పెరిగిపోయింది. ఫోర్బ్స్ ‘రియల్ టైం బిలియనీర్స్ ట్రాకర్’ ఈవిషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో 357వ స్థానంలో ట్రంప్ ఉన్నారని తెలిపింది. ‘ట్రూత్ సోషల్’ పేరుతో ఒక సోషల్ మీడియా సంస్థను ట్రంప్ నడుపుతున్నారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ పరిధిలో ఆ సంస్థ పనిచేస్తోంది.
తాజాగా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ షేరు ధర దాదాపు 9 శాతం పెరిగి రూ.4,288కి చేరింది. అందుకే ట్రంప్ నికర సంపద(Trump Net Worth) విలువ అమాంతం డబుల్ అయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకొన్ని రోజులే టైం మిగిలింది. నవంబరు 5న పోలింగ్ జరగనుంది. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌తో హోరాహోరీగా ట్రంప్ తలపడుతున్నారు. ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువేనని సర్వేలు చెబుతున్నాయి. పోలింగ్ ముగిసి, ఓట్ల లెక్కింపు జరిగితేనే అసలు ఫలితం తెలుస్తుంది.