Fire Accident: ఉండ్రాజవరం బాధితుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే.. ఎక్స్ గ్రేషియా ప్రకటన

by Y.Nagarani |
Fire Accident: ఉండ్రాజవరం బాధితుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే.. ఎక్స్ గ్రేషియా ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం (Undarajavaram) మండలం సూర్యారావుపాలెంలో బుధవారం సాయంత్రం బాణసంచా తయారీ కేంద్రంపై పిడుగు పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ పరామర్శించారు. వారికి తక్షణ సహాయంగా రూ.25 వేలు అందజేశారు. అలాగే మృతుల కుటుంబాలను పరామర్శించి.. వారికి రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed