కోహ్లీ ఈ స్థాయిలో ఉన్నాడంటే ధోనీ వల్లే : సునీల్ గవాస్కర్

by Harish |
కోహ్లీ ఈ స్థాయిలో ఉన్నాడంటే ధోనీ వల్లే : సునీల్ గవాస్కర్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మధ్య మాటల యుద్ధ కొనసాగుతోంది. కోహ్లీ స్ట్రైక్‌రేట్‌‌పై గవాస్కర్ కామెంట్ చేయగా దానికి విరాట్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. తాజాగా కోహ్లీపై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాడంటే కారణం ధోనీనే అని వ్యాఖ్యానించాడు. చెన్నయ్, బెంగళూరు మ్యాచ్‌ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్‌తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ..‘ఆరంభంలో కోహ్లీ కెరీర్ ‘స్టాప్-స్టార్ట్’ అన్నట్టుగా ఉండేది. అప్పుడు అతనికి ధోనీ అండగా నిలిచింది వాస్తవం. కోహ్లీకి వరసగా అవకాశాలు ఇచ్చాడు. దాని వల్లే మనం కోహ్లీని ఇప్పుడు ఇలా చూస్తున్నాం.’ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed