విద్యుత్ వినియోగం గతేడాదితో పోలిస్తే 51 శాతం అధికం.. లెక్కలతో డిప్యూటీ సీఎం ట్వీట్

by Disha Web Desk 5 |
విద్యుత్ వినియోగం గతేడాదితో పోలిస్తే 51 శాతం అధికం.. లెక్కలతో డిప్యూటీ సీఎం ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్ లో రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం జరిగిందని, ఈ వేసవిలో ఎంత డిమాండైనా తట్టుకునేందుకు మా విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ వినియోగంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన వినియోగానికి సంబందించి లెక్కలతో సహ వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ లో రికార్డ్ స్థాయి విద్యుత్ వినియోగం జరిగిందని, ఒక్క శనివారం రోజే విద్యుత్ వినియోగం తొంబై మిలియన్ యూనిట్లు దాటిందని చెప్పారు. గతేడాది ఇదే రోజున 59.98 యూనిట్లు మాత్రమే వాడకం జరిగిందని తెలిపారు. దానితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 51 శాతం అధికంగా విద్యుత్ వినియోగం జరిగిందని సూచించారు. అంతేగాక ఈ వేసవిలో ఎంత డిమాండైనా తట్టుకునేందుకు మా విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

లోక్ సభ ఎన్నికల వేళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ వినియోగంపై లెక్కలతో సహా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ ప్రజలకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయని ప్రతిపక్షాలు తెగ ప్రచారం చేసుకుంటున్నాయి. కేసీఆర్ పొలం బాట కార్యక్రమంలో సైతం నీళ్లు, కరెంట్ లేకనే పొలాలు ఎండిపోతున్నాయని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తమ పాలనలో కరెంట్ కష్టాలు లేవని, ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాలకు చెక్ పెట్టేందుకే లెక్కలతో సహా ట్వీట్ చేశారా? లేక ఎంతటి డిమాండ్ అయినా తట్టుకుంటున్నామని ప్రజలకు వివరించారా? అని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Next Story