హైదరాబాద్‌లో ఓ ఫ్యామిలీ మాయం! తండ్రి తప్ప అందరి విగ్రహాలు గాయబ్!

by Ramesh N |   ( Updated:2024-05-21 11:45:07.0  )
హైదరాబాద్‌లో ఓ ఫ్యామిలీ మాయం! తండ్రి తప్ప అందరి విగ్రహాలు గాయబ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో ఓ ఫ్యామిలీ మాయం అయింది. మీరు విన్నది నిజమే.. కానీ ఒక ఫ్యామిలీలోని విగ్రహాలు మిస్ అయ్యాయి. నగరంలో జూబ్లీహిల్స్ నర్నే రోడ్డులో జీహెచ్‌ఎంసీ వాళ్లు 2021లో ఒక మోడ్రన్ ఫ్యామిలీ విగ్రహాలు పెట్టారు. ఆ విగ్రహాలు ఎంతో మందిని ఆకట్టుకునేవి.. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది ఆ విగ్రహాల వద్ద సెల్ఫీలు తీసుకునేవారు. అయితే తాజాగా ఆ విగ్రహాల ఫ్యామిలీలోని తండ్రిని వదిలి భార్య, కూతురు, కొడుకు విగ్రహాలు కనిపించడం లేదని, ఆ విగ్రహాలను దొంగలు దొంగిలించారని తాజాగా నెట్టింట చర్చానీయాంశంగా మారింది.

దీనికి సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఆ విగ్రహాలు ఎలా మిస్ అయ్యాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు భార్య, కూతురు, కొడుకు షాపింగ్‌కి వెళ్ళారేమో అని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. దీన్ని దొంగతనం అనేదానికంటే కిడ్నాప్ అనుకోవాలేమోనని మరో నెటిజన్ సెటైర్లు వేశాడు.

Advertisement

Next Story