రామాలయం గేట్లు తెరిచిందే కాంగ్రెస్: జీవన్ రెడ్డి

by GSrikanth |   ( Updated:2024-05-18 14:11:04.0  )
MLC Jeevan Reddy Criticizes Komatireddy Rajagopal Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ మత విద్వేషాలను రెచ్చకొడుతున్నదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయం చేస్తోందన్నారు. దీన్ని ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఉన్నదన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పవర్‌లోకి వస్తే రామాలయాన్ని కూల్చుతామని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. రామాలయం గేట్లు తెరిచిందే కాంగ్రెస్ అని గుర్తుచేశారు. 1986 రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో ఇది జరిగిందన్నారు. అప్పట్లో రాజీవ్ గాంధీ పవర్‌లోకి వచ్చిఉంటే అప్పుడే టెంపుల్ నిర్మాణం పూర్తి అయ్యి ఉండేదన్నారు. బీజేపీ ఎన్నికల కోసం గుడిని వాడుకోవడం మంచిది కాదన్నారు. చరిత్రను వక్రీకరించి బీజేపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం ఇష్టారీతిలో మాట్లాడుతున్నారన్నారు.

కాంగ్రెస్ వస్తే రామాలయానికి బుల్డోజర్లు వస్తాయని, మోడీ ఎలా మాట్లాడుతారు? అంటూ ఫైర్ అయ్యారు. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సెక్యూలర్ పార్టీగా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. దేశంలో ధార్మిక చింతన పెంపొందించింది కూడా రాజీవ్ గాంధీ అని గుర్తుచేశారు. రాజీవ్ గాంధీ పీఎం ఉన్నపుడు దూరదర్శన్‌లో రామాయణ మహా భారతాలు ప్రసారం చేయబడ్డాయని వెల్లడించారు. కానీ మోడీ వచ్చాకే రామ మందిర నిర్మాణానికి అంకురార్పన జరిగినట్టు బీజేపీ జనాలను మోసం చేస్తుందన్నారు. దేశ ప్రజలకు వాస్తవాలను గ్రహించాలని జీవన్ రెడ్డి కోరారు.

Advertisement

Next Story

Most Viewed