‘అంబటి రాంబాబు లాంటి నీచుడ్ని ఎక్కడా చూడలేదు’.. సొంత మేనల్లుడి సంచలన వ్యాఖ్యలు (వీడియో)

by GSrikanth |   ( Updated:2024-05-06 13:22:00.0  )
‘అంబటి రాంబాబు లాంటి నీచుడ్ని ఎక్కడా చూడలేదు’.. సొంత మేనల్లుడి సంచలన వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ వైసీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆదివారం రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన మేనల్లుడు డాక్టర్ గౌతమ్ ఓ వీడియో విడుదల చేశారు. ‘అంబటి రాంబాబు లాంటి నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. శవాలమీద పేలాలు ఏరుకునే రకం. సమాజం మీద బాధ్యతలేని వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ఓటు వేయొద్దు. ఓటు వేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఓటు వేయాలి. ఇలా మాట్లాడాలా? వద్దా? చాలాసార్లు ఆలోచించుకొని మాట్లాడుతున్నాను. ఈ విషయం చెప్పడాన్ని బాధ్యతగా భావిస్తున్నాను. నిస్సిగ్గుగా పెద్ద గొంతు వేసుకొని అబద్ధాన్ని కూడా నిజం చేసేయగలమనే కాన్ఫిడెన్స్‌తో బతుకుతారు. ఎంత లేకి పని అయినా చేసి సమాజంలో చాలా గౌరవంగా బతుకుతున్నామని అనుకుంటారు. మనం కూడా ఎలాంటి వ్యక్తికి ఓటేస్తున్నామో చూసుకోవాలి. ఇలాంటి వారికి ఓటు వేస్తే సమాజం కూడా ఇలాగే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి మీ సరైన ఓటును బాధ్యతతో సరైన వ్యక్తికి వేసి, మంచి నాయకుడ్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నాను’’ అని డాక్టర్ గౌతమ్ ఓ వీడియోను విడుదల చేశారు. దీనిపై అంబటి రాంబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Click here to Twitter Post

Advertisement

Next Story

Most Viewed