- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
road accident : తృటిలో తప్పిన ప్రమాదం..రోడ్డు గుంతలో దిగబడిన లారీ
దిశ, నాగిరెడ్డిపేట్ : మండలంలోని బంజారా తండా గ్రామం సమీపంలో పెను ప్రమాదం తప్పింది . బోధన్ ,హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ఓ లారీ దిగబడి తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా.. బంజారా తాండ గ్రామం వద్ద కల్వర్టుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో.. వాహనాలు వెళ్లేందుకు సంబంధిత కాంట్రాక్టర్ రోడ్డు ప్రక్క నుంచి నాణ్యత లేకుండా మట్టి రోడ్డు ఏర్పాటుచేసి వాహనాలను దారి మళ్లించారు. దీంతో మట్టి రోడ్డుపై వెళ్తున్న లారీ కి ఎదురుగా మరో వాహనం రావడంతో..లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి లారీని బోల్తా పడకుండా నిలిపివేశాడు.దీంతో లారీ బోల్తా పడకుండా పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారి నిర్మాణ పనుల సంబంధిత గుత్తేదారు రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టకపోవడంతోనే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా చేపడుతున్న రహదారి ప్రక్కన లోతైన గుంతలు తవ్వుతుండడంతో.. రాత్రివేళ గుంతల్లోకి వాహనాలు వెళ్లకుండా సంబంధిత గుత్తేదారు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.