తెలంగాణ యూనివర్సిటీ వీసీ హల్‌చల్.. బయటి వ్యక్తులతో గర్ల్స్ హాస్టల్‌లోకి చొరబడి

by GSrikanth |   ( Updated:2022-09-10 05:43:09.0  )
తెలంగాణ యూనివర్సిటీ వీసీ హల్‌చల్.. బయటి వ్యక్తులతో గర్ల్స్ హాస్టల్‌లోకి చొరబడి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ వివాదంలో చిక్కుకున్నారు. గణేష్ నిమజ్జనం అనంతరం గర్ల్స్ హాస్టల్‌లోకి మరో ఇద్దరు బయటి వ్యక్తులతో వచ్చిన వీసీ డ్యాన్సులు చేయడం కలకలం రేపుతోంది. డ్యాన్సులు చేస్తూ, డబ్బులు పంచుతూ వీరంగం సృష్టించినట్లు సమాచారం. ఈ క్రమంలో వీసీ ప్రవర్తనతో విస్తుపోయిన విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గమనించిన వీసీ డ్యాన్స్ చేస్తున్న విద్యార్థినుల దగ్గరకు వెళ్లి గేట్ ఓపెన్ చేయించుకొని బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం డ్యాన్సులు చేయడం, డబ్బులు పంచడంతో వీసీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు వీసీ ప్రవర్తనపై మండిపడుతున్నాయి. గర్ల్స్ హాస్టల్‌లోకి వీసీ వెళ్లడంపై సీరియస్ అవుతున్నారు.

Also Read : బీసీ బాలుర వసతి గృహంలో ఐదో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి

Advertisement

Next Story