పేకాట స్థావరాలపై టాస్క్ఫోర్స్ దాడి

by Sridhar Babu |
పేకాట స్థావరాలపై టాస్క్ఫోర్స్ దాడి
X

దిశ, నిజామాబాద్ క్రైం : ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్, అంకాపూర్ శివారులో ఏర్పాటు చేసిన పేకాట స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీస్ లు దాడులు నిర్వహించారు. శుక్రవారం నిజామాబాద్ టాస్క్ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజ్ ఆధ్వర్యంలో సీఐ అజయ్ బాబు సిబ్బంది దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న వారివద్ధ నుంచి రూ. 68,230 లను స్వాధీనం చేసుకుని, 9 మంది పేకాట ఆటగాళ్లను అరెస్టు చేశారు. వారిని ఆర్మూర్ పోలీస్ లకు అప్పజెప్పినట్లు ఏసీపీ రాజశేఖర్ రాజ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed