ఉర్దూ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తాహేర్ బిన్ హందాన్

by Sridhar Babu |
ఉర్దూ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తాహేర్ బిన్ హందాన్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత తాహేర్ బిన్ హందాన్ ఉర్దూ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం హైద్రాబాద్ లోని హజ్ హౌస్ లో జరిగిన కార్యక్రమంలో లాంఛనంగా రాష్ర్ట మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కోత్వాల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్ల హుస్సేన్ తో పాటు మరి కొంత మంది సమక్షంలో తాహేర్ బాధ్యతలను స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికల నర్సారెడ్డి , రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర అధ్యక్షులు కేశ వేణు, నరాల రత్నాకర్, ముత్యాల సునిల్, పొద్ధుటూరి వినయ్ రెడ్డి తాహేర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed