Sri Ramsagar Project : జలకళను సంతరించుకుంటున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్..

by Sumithra |
Sri Ramsagar Project : జలకళను సంతరించుకుంటున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్..
X

దిశ, బాల్కొండ : మహారాష్ట్ర విష్ణుపురి, బాలిగావ్ ప్రాజెక్ట్ ల నుంచి భారీగా మిగులు జలాలను విడుదల చేయడంతో వరద ఎస్సారెస్పీలోకి వచ్చి చేరుతుందని ఏఈఈ కె.రవి తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరద వస్తుందన్నారు. మొత్తం 53,424 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతుందన్నారు. ఉదయం 6 గంటలకు రిజర్వాయర్ లోకి 29,960 క్యూసెక్కుల వరద కొనసాగి, 9 గంటలకు 42,386 క్యూసెక్కులకు వచ్చింది.

దీంతో ఎస్సారెస్పీ జలకళను సంతరించుకుంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు 53,424 క్యూసెక్కుల వరద పెరిగింది. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరిగింది. సీజన్ లో ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్ లోకి 36 టీఎంసీల వరద వచ్చి చేరిందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 80.5 టీఎంసీలు కాగా శుక్రవారం 1078.50 అడుగులు 41.122 టీఎంసీల నీటి నిల్వ ఉందని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed