- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోవింద నామస్మరణతో మార్మోగిన శ్రీమన్నింబాచల
దిశ ,ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీమన్నింబాచల క్షేత్రం బుధవారం గోవింద నామస్మరణతో పులకించిపోయింది. ఈనెల 8 నుంచి భీమ్ గల్ శివారులోని లింబాద్రి గుట్టపై జరుగుతున్న శ్రీలక్ష్మీ నారసింహుని బ్రహ్మోత్సవాలు భక్త జనసందోహం మధ్య వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి చక్రం చక్రతీర్థ స్వాముల వారిని పల్లకీలో కొలువుంచి..గిరిప్రదక్షిణ గావించారు. సుమారు మూడు కిలోమీటర్ల చుట్టు కొలతతో ఉన్న కొండ చుట్టూ గిరిప్రదక్షిణలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. లింబాద్రిగుట్టపై జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు ఏలాంటి ఆపదలు, పీడలు కలుగకుండా దుష్టశక్తుల కాపాడేందుకు స్వామివారు శ్రీచక్రతీర్థ స్వామిని కొండ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాడని, ఇదే గిరిప్రదక్షిణగా ఆలయ అర్చకులు చెపుతున్నారు.
గర్బాలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా స్వామివారు కొలువైన కొండ (గిరి) చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తే అశేష పుణ్యప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. గిరి ప్రదక్షిణలో భాగంగా స్వామివారి ఆయుధం చక్రతీర్థ స్వాముల వారిని పల్లకీలో బ్రాహ్మణోత్తములు ముందు నడువగా బోయలు చక్రస్వామి కొలువై ఉన్న పల్లకీని బోయలు మోస్తూ.. ముందుకు కదులుతారు. దాదాపు రెండు కిలోమీటర్లకు పైగా ఉన్న కొండ చుట్టూ చక్రతీర్థ స్వాముల వారిని ఊరేగిస్తారు. ఊరేగింపులో వందలాది మహిళలు, పురుషులు పల్లకీని అనుసరిస్తూ.. స్వామివారికి జయజయ ధ్వానాలు చేస్తూ తరిస్తారు. శ్రీలక్ష్మీనరసింహ స్వామి గోవిందా.. గోవిందా అంటూ భక్తులు తన్మయత్వంలో చేసిన జయజయ ధ్వానాలు కొండల్లోని ప్రతి శిలను పులకించేలా చేశాయి. గోవింద నామస్మరణలో స్వామి వారు కొలువైన కొండపై వృక్షాలు, పక్షులు భక్తి పారవశ్యంతో స్వామివారి ఊరేగింపు చూసి మైమరిచి పోయాయా అన్న చందంగా కొండపై చెట్లన్నీ కొమ్మలు ఆకులు ఊగుతూ కనిపించాయి. పక్షుల కిలకిల రాగాలతో స్వామి వారి జయజయ ధ్వానాల వుంచి బోయలు పల్లకీని మోస్తూ.. కొండ చుట్టూ ప్రదక్షిణ చేసే కార్యక్రమాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చిన వందలాది మంది భక్తులు గిరిప్రదక్షిణలో భక్తిప్రపత్తులతో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులయ్యారు. ఉదయాన్నే భక్తులు గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని తిలకించేందుకు, గిరిప్రదక్షిణలో పల్లకీతో పాటు.. నడిచేందుకు ఉదయాన్నే కొండపైకి చేరుకున్నారు.