ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం

by Sridhar Babu |
ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం
X

దిశ, భిక్కనూరు : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీ లను రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. కామారెడ్డి లో జరిగే రాహుల్ గాంధీ పర్యటనను పురస్కరించుకొని ఆయన పర్యటనలో పాల్గొనేందుకు వెళ్తూ ఆయన ఆదివారం భిక్కనూరు మండల కేంద్రం సమీపంలోని అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న ఆయన తనను కలిసిన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే తాము ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తమ ప్రభుత్వం విఫలమైందని సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆ తండ్రి, కొడుకుల మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

దమ్ముంటే ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామో లేదో తెలుసుకోవడానికి కర్ణాటక కు రావాలని, లేకపోతే వారి బంధువులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవాలన్నా రు. ఆరు గ్యారంటీలను డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే, మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఆరు గ్యారంటీ లపై తొలి సంతకం చేస్తుందని స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో కరెంటు సమస్య తలెత్తిందని, కర్ణాటక ఆర్టీసీ బస్సులు రాష్ట్రంలో సరిగా తిరగడం లేదని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రులు చెబుతూ ఓట్లు అడుగుతుండడం సిగ్గుచేటన్నారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని, వారికి మూడెకరాల భూమి ఇస్తామని,

అర్హులైన నిరుపేదలకు రెండు పడక గదుల ఇండ్లు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాడని మండిపడ్డారు. 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం శివకుమార్ ను శాలువా కప్పి సత్కరించారు. ఆయన వెంట ఏఐసీసీ కార్యదర్శి మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ కార్యదర్శి బద్ధం ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపరి భీంరెడ్డి, మండల ఇంచార్జ్ నేరెళ్ల శారద, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బల్యాల రేఖ, ఎన్ఆర్ఐ సెల్ జిల్లా కన్వీనర్ చిట్టెడి సుధాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల సుదర్శన్, అంకం రాజు, ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed