Rain alert: బంగాళఖాతంలో అల్పపీడనం.. దంచికొడుతున్న భారీ వర్షాలు..

by Mahesh |
Rain alert: బంగాళఖాతంలో అల్పపీడనం.. దంచికొడుతున్న భారీ వర్షాలు..
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. సోమవారం సాయంత్రానికి అల్పపీడనంగా మారింది. మంగళవారం ఉదయం మరింత బలపడి.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఈ అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే 2 రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం వైపు కదిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అల్పపీడనం కారణంగా ఈరోజు, రేపు కోస్తా, రాయలసీమలో విస్తృతంగా వర్షాలు కురవనున్నాయి. ఇందులో ముఖ్యంగా ప.గో, బాపట్ల, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కర్నూలు, నంద్యాల, అన్నమయ్య.. చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ అల్పపీడనం కారణంగా తీరం వెంబడి గంటకు 35-55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.

Next Story

Most Viewed