కోరుట్లలో దారుణం.. నడిరోడ్డు పై యువకుడి దారుణ హత్య..

by Sumithra |
కోరుట్లలో దారుణం.. నడిరోడ్డు పై యువకుడి దారుణ హత్య..
X

దిశ, కోరుట్ల టౌన్ : ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ప్రకాశం రోడ్డుకు చెందిన బోయిని సాగర్ (33) అనే యువకుడి పై సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. తీవ్రగాయాలైన సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్ఐ శ్రీకాంత్ లు చేరుకొని హత్యకు గల కారణాల పై విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed