Hyderabad Rains : నగరంలో దంచికొడుతున్న భారీ వర్షం

by Mahesh |   ( Updated:2024-10-15 05:57:29.0  )
Hyderabad Rains : నగరంలో దంచికొడుతున్న భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి, అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ పట్టణంలో ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. తెల్లవారుజామునుంచే.. మేఘాలతో కమ్ముకొని పోయిన నగరంలో ఒక్కసారిగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపుల శబ్దం తో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఎల్బీనగర్, సాగర్ ఎక్స్ రోడ్, తార్నాక, షేక్ పేట, జూబ్లీహిల్స్, లకిడికపూల్, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, రామ్ నగర్, రామంతపూర్, తార్నాక, సికింద్రాబాద్, మాదాపూర్, యూసుఫ్ గూడ, మలక్ పేట, మల్కాజ్గిరి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కాగా ఆల్పపీడనం కాస్త వాయుగుండంగా మారడంతో మరో రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో పక్క ఈ అల్పపీడనం, తుఫాను కారణంగా ఏపీలోని పలు జిల్లాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో తమిళనాడులోని కీలక పట్టణాలు చెరువులను తలపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed