- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sajjala Ramakrishna Reddy : వైసీపీ నేత సజ్జలకు లుక్ అవుట్ నోటీస్
దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేరుతో లుక్ అవుట్ నోటీసులు జారీ కావడం సంచలనంగా మారింది. లుక్ అవుట్ నోటీసుల జారీ నేపథ్యంలో ఇమిగ్రేషన్ సిబ్బంది సజ్జలను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. తాను ఇప్పుడే విదేశాల నుంచి తిరిగి వచ్చానని, తనకు కనీస సమాచారం లేకుండానే లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం ఏమిటంటూ ఈ సందర్భంగా మండిపడ్డారు. ఈ వ్యవహారంపై మరింత సమాచారం తీసుకున్న ఇమిగ్రేషన్ అధికారులు సజ్జలకు ఏపీ వెళ్ళేందుకు అనుమతించారు. అప్పటికే హైదరాబాద్‌కు వెళ్లే విమానం టేకాఫ్ కావడంతో మరో విమానం కోసం సజ్జల వేచి చూడాల్సి వచ్చింది.
వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాం పై లుక్ అవుట్ నోటీస్ జారీ చేసినట్లు పోలీస్ వర్గాల కథనం. లుక్ అవుట్ నోటీస్ కారణంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో సజ్జల రామకృష్ణారెడ్డిని అడ్డుకున్నారంటూ వైసీపీ ఆరోపణలు చేస్తోంది. హీరోయిన్ జేత్వాణి పై వేధింపుల కేసులో వైసీపీ సలహాదారులు సజ్జల ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అటు దేవినేని , తలశిల, లేళ్ల అప్పిరెడ్డిలు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులుగా ఉన్నారు.