Happy Birthday Sai Durgha Tej పడి లేచిన కెరటం మెగా మేనల్లుడు.. రూ. 120 కోట్లతో మరోసారి కంబ్యాక్ ఇవ్వనున్న తేజ్

by Anjali |   ( Updated:2024-10-15 14:32:47.0  )
Happy Birthday Sai Durgha Tej పడి లేచిన కెరటం మెగా మేనల్లుడు.. రూ. 120 కోట్లతో మరోసారి కంబ్యాక్ ఇవ్వనున్న తేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోనున్నారు. పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ సమయంలోనే బెస్ట్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. ఎన్ని అపజయాలు ఎదురైన వెనకడుగు వేయకుండా కెరీర్‌లో ముందుకు సాగుతూ వస్తున్నాడు. చాలా మంది మెగా మామయ్యల మేనరిజాంలను కాపీ కొడుతున్నాడని కామెంట్స్ చేశారు. ఎన్నో నెగిటివ్ ట్రోల్స్ ను ఎదుర్కొన్నాడు సాయి ధరమ్ తేజ్.

చివరకు వరుసగా ఏకంగా ఆరు ఫ్లాపుల అనంతరం చిత్రలహరి చిత్రంతో మంచి కంబ్యాక్ ఇచ్చి తన టాలెంట్ బయటపెట్టాడు. తర్వాత సోలో బతుకు సో బెటర్, ప్రతి రోజు పండగే సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించాడు. సినీ కెరీర్ లో పడి లేచిన క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ కు బైక్ యాక్సిడెంట్ అయ్యి.. ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు. ఆ సమయంలో తల్లి చిన్నపిల్లాడిగా చూసుకుని ఈ హీరోను కోలుకునేలా చేసింది.

ఇక రీసెంట్‌గా సాయి ధరమ్ తేజ్ నేమ్ లో తన తల్లి పేరైన దుర్గను యాడ్ చేసుకున్నాడు. సాయి దుర్గ తేజ్ అని పెట్టుకున్నాడు. ఇక యాక్సిడెంట్ కారణంగా సినిమాల్లో నటించడేమో అని అనుకున్న సమయంలోనే తేజ్ విరూపాక్ష చిత్రంతో కంబ్యాక్ ఇచ్చి.. ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టి జనాలందర్ని షాకింగ్‌కు గురి చేశాడు. మెగా మేనల్లుడు త్వరలో 120 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతున్న SDT18 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Advertisement

Next Story