Tirumala News: భారీ వర్షాలు.. తిరుమలకు పోటెత్తిన భక్తులు

by Mahesh |   ( Updated:2024-10-15 06:32:54.0  )
Tirumala News: భారీ వర్షాలు.. తిరుమలకు పోటెత్తిన భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. దీనికి తోడు చెన్నై మీదుగా తుఫాను ఏర్పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా.. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే మరో మూడు రోజుల పాటు కురుస్తూనే ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసి.. తిరుమలకు వచ్చే భక్తులను అప్రమత్తం చేసింది. అయినప్పటికి తిరుమల తిరుపతిలో భక్తుల రద్ధీ తగ్గడం లేదు. గత నాలుగు రోజుల తో పోల్చుకుంటే తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచిఉన్నారు. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉంటే నిన్న తిరుమల శ్రీవారిని 75,361 మంది భక్తులు దర్శించుకోగా.. 28,850 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. దీంతో టీటీడీకి రూ.3.91 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలతో అప్రమత్తమైన టీటీడీ.. భక్తులకు వసతి, ప్రసాదం, భోజన విషయంలో ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంది.

Next Story

Most Viewed