- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ADAH SHARMA: దివంగత సుశాంత్ ఇంటిని టోటల్‌గా మార్చేసిన హీరోయిన్.. ఏ రూమ్ ఎందుకోసం వాడిందంటే?
దిశ, వెబ్‌డెస్క్: క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, టెలివిజన్ నటుడిగా, ప్రెజెంటర్‌గా గొప్ప పేరు దక్కించుకున్నారు దివంగత నటుడు సుశాంత్ సింగ్. ఈయన 1998 లో ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సత్య సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. సుశాంత్ సింగ్ 14 June 2020 లో మరణించారు. అయినప్పటికీ ఈ నటుడి గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇటీవలే హీరోయిన్ ఆదా శర్మ.. సుశాంత్ ఇళ్లును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఫ్యామిలీతో ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారట. అయితే పలువురు పబ్లిసినీ కోసమే ఆదా ఇలా చేసిందంటూ నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి.
తాజాగా ఆదా శర్మ ఈ వార్తలపై స్పందించి.. ఈ విధంగా రూమర్స్ క్రియేట్ చేసేవారిని తను పట్టించుకోనని తెలిపింది. అలాగే నటిగా తనకు ఎన్నో పనులు ఉంటాయని చెప్పింది. మంచి పర్సన్ ను అని ఇతరులకు తెలియజేయాల్సిన అవసరం ఆమెకు లేదని, ఇల్లు కొనాలనిపించింది కొన్నానని వెల్లడించింది. ఎవరికోసం తన పద్ధతి మార్చుకోనని తెలిపింది. అలాగే సుశాంత్ ఇల్లు ఆదా శర్మకు బాగా నచ్చిందని, ఏదో తెలియని శక్తి ఉందని పేర్కొంది.
తన అమ్మమ్మతో కలిసి సుశాంత్ ఇంట్లోనే ఉంటున్నానని, ఇంట్లోకి రాగానే చాలా పాజిటివ్ గా అనిపించిందని తెలిపింది. ఇంటిని రీమోడలింగ్ చేశానని, ఫస్ట్ ఫ్లోర్ ను టెంపుల్‌లా తీర్చిదిద్దానని వివరించింది. అంతేకాకుండా ఒక రూమ్ ను డ్యాన్స్ కోసం.. మరో గదిని మ్యూజిక్ కోసం.. స్టూడియోగా చేశానని వెల్లడించింది. ఇక టెర్రస్ అయితే మొత్తం గార్డెన్‌లాగా మార్చానని ఆదాశర్మ పేర్కొంది.