- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ రికార్డు కోసం 1,121కిలోల గుమ్మడికాయ
దిశ, వెబ్ డెస్క్ : అమెరికన్లలో భారీ గుమ్మడికాయలకు ఉండే క్రేజ్ ప్రత్యేకమైంది. ఏటా అక్కడా గుమ్మడి కాయల ప్రపంచ చాంపియన్ షిప్ పోటీలు సైతం నిర్వహిస్తుంటారు. రికార్డుల కోసం భారీ గుమ్మడి కాయల సాగును చేపట్టే రైతులు కూడా ఉన్నారు. అలాంటి రైతుల్లో ట్రావిస్ జింజర్ అనే హార్టీకల్చర్ టీచర్ కూడా ఒకరు. ఇటీవలే దక్షిణ శాన్ ఫ్రాన్సిస్కోలోని హఫ్ మూన్ బేలో 51వ వరల్డ్ ఛాంపియన్ షిప్ పంప్ కిన్ వేఆఫ్ పోటీలలో తను పండించిన 1,121కిలోల గుమ్మడి కాయతో పాల్గొని ట్రావిస్ జింజర్ విజేతగా నిలిచారు. రెండో స్థానంలో నిలిచిన రైతు గుమ్మడి కాయ కంటే జింజిర్ పండించి తెచ్చిన గుమ్మడికాయ బరువు మూడు కిలోలు అదనంగా ఉండటంతో నిర్వాహకులు ఆయనను విజేతగా ప్రకటించారు. ట్రావిస్ జింజర్ పండించిన గుమ్మడి కాయ బరువు ప్రపంచ రికార్డు సాధించిన 1247 కిలోల గుమ్మడి కంటే కేవలం 126 కిలోలే తక్కువ. ఈ భారీ గుమ్మడికాయను తీసుకొని తన కుటుంబం మొత్తం 35 గంటలు ప్రయాణించి పోటీల వేదికకు చేరుకొన్నట్లు జింజిర్ వెల్లడించాడు.
ప్రతి ఏటా ప్రపంచ రికార్డు లక్ష్యంగా భారీ గుమ్మడి కాయాలను పండిస్తున్నానని, మంచు, వర్షాల కారణంగా గుమ్మడి కాయ ఆశించిన ఎదుగుదల చెందకపోవడంతో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని ఈ ధఫా కోల్పోయినట్లు తెలిపాడు. మునుముందు తన ప్రయత్నం కొనసాగుతుందన్నాడు. సారవంతమైన భూమి, నాణ్యమైన పోషకాలు అందించడంతోనే తాను భారీ గుమ్మడికాయల దిగుబడి సాధిస్తున్నట్లుగా చెప్పాడు.