Pushpa: మావోయిస్టుల ప్రాంతంలో పుష్ప ఎన్నిడేస్ ఆడిందో తెలుసా.. సెకండ్ పార్ట్‌పై భారీ హైప్ పెంచుతోన్న నిర్మాత

by Anjali |   ( Updated:2024-10-15 14:33:40.0  )
Pushpa: మావోయిస్టుల ప్రాంతంలో పుష్ప ఎన్నిడేస్ ఆడిందో తెలుసా.. సెకండ్ పార్ట్‌పై భారీ హైప్ పెంచుతోన్న నిర్మాత
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ పార్ట్-1 ఏ రేంజ్‌లో హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన్న జంట తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బన్నీ అద్భుతమైన నటనకు ఏకంగా నేషనల్ అవార్డ్ దక్కింది. శ్రీవల్లి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక యాక్టింగ్ అదిరిపోయిందనడంలో అతిశయోక్తిలేదు. ప్రస్తుతం పుష్ప రెండో భాగం షూటింగ్ జరుగుతోంది. పార్ట్-1 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో రెండో భాగంపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఐకాన్ స్టార్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా డిసెంబరు 6 న బాక్సాఫీసును షేక్ చేయనుంది.

ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నిర్మాత SKN పుష్ప చిత్రం గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. కోల్‌తాలో ఓ మావోయిస్టు ప్రాంతం ఉందని తెలిపారు. కాగా సాధారణంగా అయితే ఆ ప్లేస్‌లో సెకండ్ షో లు పడవని వెల్లడించారు. అలాంటి మావోయిస్టుల ప్రాంతంలో ఈ మూవీ ఏకంగా 50 డేస్ ఆడిందని తెలియడంతో నిజంగా ఆశ్చర్యానికి గురయ్యానంటూ వ్యాఖ్యానించారు. దీంతో పుష్ప రీచ్ ఆ తరహాలో ఉందా? అని భావించానని అన్నారు.

అలాగే సెకండ్ పార్ట్ లో పలు సన్నివేశాలు చూశానని.. ఐకాన్ స్టార్ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసి షాక్ అయ్యానంటూ తెలిపారు. దీంతో పుష్ప 2 ఎప్పుడెప్పుడు చూస్తానని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానని వెల్లడించారు. 70 సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో ఆ ఘనత ఎవరూ సాధించలేదని.. అల్లు అర్జున్ ఏకంగా బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు అందుకోవడం నిజంగా గ్రేట్.. ఇకపై కూడా మరెన్నో అవార్డులు సొంతం చేసుకోవాలంటూ నిర్మాత SKN చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story