ఎంపికైన ఉపాధ్యాయులకు షాక్.. డీఎస్సీ కౌన్సెలింగ్‌పై విద్యాశాఖ కీలక ప్రకటన

by karthikeya |   ( Updated:2024-10-15 06:01:55.0  )
ఎంపికైన ఉపాధ్యాయులకు షాక్.. డీఎస్సీ కౌన్సెలింగ్‌పై విద్యాశాఖ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు విద్యాశాఖ షాకిచ్చింది. ఈ రోజు (మంగళవారం) అభ్యర్థులందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు ఖరారు చేస్తారనుకుంటున్న సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నామని, తదుపరి కౌన్సెలింగ్ తేదీలను త్వరలో వెల్లడిస్తామని వెల్లడించింది.

కాగా.. తెలంగాణలో డీఎస్సీ-2024 ద్వారా ఎంపికైన 10,006 మంది కొత్త టీచర్లకు అక్టోబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. దీంతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు తెగ ఖుషీ అయిపోయారు. ఇక కౌన్సెలింగ్ తర్వాత పోస్టింగ్ పట్టేయడమే అనుకున్నారు. కానీ, ఈ రోజు కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన తరుణంలో ఇలా ఆఖరి నిముషంలో విద్యాశాఖ వాయిదా ప్రకటన రావడంతో నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులంతా షాక్‌కు గురయ్యారు.

Read More : గ్రూప్ 1 మెయిన్స్‌కు కోర్టు గ్రీన్‌ సిగ్నల్

Next Story

Most Viewed