శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు గణనీయంగా పెరిగిన నీటిమట్టం

by Aamani |
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు గణనీయంగా పెరిగిన నీటిమట్టం
X

దిశ, బాల్కొండ : కుంభవృష్టి వర్షాల కారణంగా గైక్వాడ్, విష్ణుపురి, బాలెగావ్, బాబ్లీ ప్రాజెక్టుల నుంచి గేట్లను ఎత్తి మిగులు జలాలను విడుదల చేశారు. అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్ భారీగా వరద పోటెత్తింది. 24 గంటలలో ప్రాజెక్టులోకి 10 టీఎంసీల వరద నీరు వచ్చి చేరి ప్రాజెక్టు నీటిమట్టం గణనీయంగా పెరిగింది . మరో 10 టీఎంసీల వరద నీరు వచ్చి చేరితే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్ లోకి 1,62,182 క్యూసెక్కుల వరద చేరుతుంది.

దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు రిజర్వాయర్ కు వరద పోటెత్తకముందే ఎస్సారెస్పీ ఎగువ దిగువ ప్రాంత గ్రామ ప్రజలకు, అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఏ క్షణాన్నైనా ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 80.5 టీఎంసీలు కాగా సోమవారం ఉదయానికి 1088.30 అడుగులు 70.710 టీఎంసీల నీటి నిల్వకు చేరుకుంది

Advertisement

Next Story

Most Viewed