పురుష ఉద్యోగులతో సమానంగా మహిళల సేవలు

by Sridhar Babu |
పురుష ఉద్యోగులతో సమానంగా మహిళల సేవలు
X

దిశ, కామారెడ్డి : మహిళా ఉద్యోగులు పురుష ఉద్యోగులతో సమానంగా సేవలందిస్తున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉత్తమ సేవలందించిన మహిళా ఉద్యోగులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులను టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. మహిళలు ఇంటిని చక్కదిద్దినట్లే సమాజ మార్పునకు దోహదపడాలని సూచించారు. మహిళా ఉద్యోగుల సేవలు అభినందనీయమని కొనియాడారు.

కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి యేటా టీఎన్జీవోస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళా ఉద్యోగులను టీఎన్జీవోస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సన్మానించుకోవడం ఒక బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. జిల్లా కార్యదర్శి బి. సాయిలు మాట్లాడుతూ... టీఎన్జీవోస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగ సోదరీమణులకు టీఎన్జీవోస్ ఎల్లవేళలా తోడుగా ఉంటుందని, వారికి సమస్యలు ఉంటే తమ సంఘం దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర సంఘం కార్యదర్శి

ఎం.నాగరాజు, జిల్లా సహాధ్యక్షులు ఎం.చక్రధర్, టీఎన్జీవోస్ జిల్లా కోశాధికారి ఎం.దేవరాజు, ఉపాధ్యక్షుడు ఎంసీ. పోచయ్య, లక్ష్మణ్, సుజాత, జాయింట్ సెక్రెటరీలు రాజిరెడ్డి, రాజ్యలక్ష్మి, నవిత, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్, కల్చరల్ సెక్రటరీ రాజ్ కుమార్, ఈసీ మెంబర్లు శ్రీకాంత్, సాయినాథ్ స్వప్న, శాంతయ్య, లక్ష్మీ నర్సవ్వ, కామారెడ్డి అర్బన్ తాలూకా యూనిట్ కార్యదర్శి శివకుమార్, ఉపాధ్యక్షులు ఏం.కిషన్, కామారెడ్డి రూరల్ తాలూకా యూనిట్ కార్యదర్శి జూగల్ కిషోర్, పంచాయతీ సెక్రెటరీ ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కామారెడ్డి జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed