పే స్కేల్‌ వర్తింపజేయడం పట్ల సెర్ప్‌ ఉద్యోగుల హర్షం

by samatah |
పే స్కేల్‌ వర్తింపజేయడం పట్ల సెర్ప్‌ ఉద్యోగుల హర్షం
X

దిశ నిజామాబాద్ సిటీ: పే స్కేల్‌ వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం పట్ల సెర్ప్‌ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు బుధవారం క్షీరాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ..సెర్ఫ్ ఉద్యోగస్తుల చిరకాల కల నెరవేరిందని, 2002 నుంచి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి జీవో నెంబర్‌ 11 ప్రకారం పే స్కేల్‌ మంజూరు చేసినందుకు,క్రమబద్ధీకరించినందుకు సెర్ప్‌ ఉద్యోగులు పక్షాన సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.మంచి వేతనం అందించడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్‌కు సెర్ప్‌ ఉద్యోగులు రుణపడి ఉంటారని అన్నారు.

20 ఏండ్లుగా సెర్ప్‌లో ఉద్యోగం చేస్తు. 2,150 జీతంతో ఉద్యోగంలో చేరిన వారికి సీఎం కేసీఆర్ చొరవతో 25వేల వరకు జీతం వస్తున్నదని, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని వారితో వెట్టి చాకిరి చేయించుకున్నయన్నారు. మహిళా చైతన్యమే ధ్యేయంగా శ్రమిస్తున్న సెర్ప్‌ ఉద్యోగుల ‘పే స్కేల్‌ కల’ నెరవేరిందని రెండు దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడిందని,గత శనివారమే రాష్ట్ర సర్కారు అందుకు సంబంధించిన జీవో జారీ చేశారన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజీ గంగాధర్ గౌడ్, జిల్లా యువ నాయకుడు జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు ధర్పల్లి జడ్పిటిసి జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్మోహన్. సెర్ప ఉద్యోగులు, ఐకేపీ మహిళా సంఘాల నాయకురాలు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed