రమణారెడ్డి లాంటి వ్యక్తి చాలా అరుదు.. గంప గోవర్ధన్

by Sumithra |
రమణారెడ్డి లాంటి వ్యక్తి చాలా అరుదు.. గంప గోవర్ధన్
X

దిశ, కామారెడ్డి : సొంత ఆస్తులు అమ్మి 150 కోట్లతో సొంత మేనిఫెస్టో విడుదల చేసి ఉచిత విద్య, కార్పొరేట్ వైద్యం, రైతులకు కల్లాలు అందిస్తానని చెప్పడం గొప్పవిషయమని, ఆ మాట నిలబెట్టుకోవాలని నూతనంగా ఎన్నికైన కాటిపల్లి వెంకట రమణారెడ్డికి తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంకట రమణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాటిపల్లి వెంకట రమణారెడ్డి లాంటి వ్యక్తి దేశంలోనే అరుదుగా ఉంటారని కొనియాడారు. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేసి ఓడిపోవడం బాధాకరమని, అయినా ప్రజల తీర్పును శిరసావహిస్తామన్నారు.

జరిగిన పొరపాట్ల పై సమీక్ష చేసుకుంటామని, భవిష్యత్తులో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని తెలిపారు. 2009 లో తాను టీడీపీ నుంచి 15 సంవత్సరాలుగా ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించారన్నారు. 2011 లో తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రజల నిర్ణయం మేరకు టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని, ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ద్వారా కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం చేసే మంచి పనులను అభినందిస్తూనే ప్రజావ్యతిరేక విధానాల పై పోరాడతామన్నారు.

Advertisement

Next Story

Most Viewed