తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన మూసీ బాధితులు

by Gantepaka Srikanth |
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన మూసీ బాధితులు
X

దిశ, వెబ్‌డెస్క్: మూసీ రివర్ బెడ్(Musi River Bed) బాధితులు తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించారు. తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని.. ఇటీవల తమ ఇళ్లపై అధికారులు మార్కింగ్ చేశారని పిటిషన్‌లో బాధితులు పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టు విచారణ చేపట్టనుంది. కాగా, మూసీ సుందరీకరణలో భాగంగా హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని మూసీ నది పరివాహక ప్రాంతంలోని మొత్తం 1,595 నిర్మాణాలను గతంలో డ్రోన్‌ సర్వే ద్వారా గుర్తించారు.

ఇటీవల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్లకు మార్కింగ్ చేశారు. మొత్తం 1,333 ఇళ్లకు మార్కింగ్‌ చేశారు. దీంతో తమ ఇళ్లను కూల్చబోతున్నారని భయంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతంలో మార్కింగ్‌ నిలిచిపోయింది. మూసీ రివర్‌బెడ్‌లో నివనిస్తున్న కుటుంబాల నుంచి పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతుండటంతో రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లడం లేదు. ఇప్పటివరకు మార్కింగ్‌ పూర్తయిన బాధితులను డబుల్‌ బెడ్‌రూమ్‌లకు తరలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed