Samantha: గెట్ రెడీ.. సమంత ‘సిటాడెల్ హనీ బన్నీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ (పోస్ట్)

by Hamsa |   ( Updated:2024-10-14 12:08:24.0  )
Samantha: గెట్ రెడీ.. సమంత ‘సిటాడెల్ హనీ బన్నీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ (పోస్ట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), వరుణ్ ధావన్ జంటగా నటించిన యాక్షన్ సిరీస్ ‘సిటాడెల్ హనీ బన్నీ’(Citadel Honey Bunny). రాజ్ అండ్ డీకే(Raj and DK) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ షూటింగ్ ఏడాది క్రితమే పూర్తి అయినప్పటికీ ఓటీటీలోకి రాలేదు. ఇటీవల దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రాలేదు. అయితే గత ఏడాదిన్నర నుంచి సమంత(Samantha) అభిమానులు ఈ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. తాజాగా, సామ్(Samantha) సిటాడెల్ ట్రైలర్ రాబోతున్నట్లు పోస్ట్ ద్వారా తెలిపింది. అక్టోబర్ 15న ఈ యాక్షన్ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ రాబోతున్నట్లు ప్రకటించడంతో పాటు పోస్టర్‌ను షేర్ చేసింది. దీంతో పలువురు సీని ప్రముఖులతో పాటు నెటిజన్లు ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు కామెంట్లు పెడుతున్నారు.

కాగా, సమంత గత ఏడాదిన్నర నుంచి మయోసైటీస్ వ్యాధి కారణంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల సోషల్ మీడియా ద్వారా పలు పోస్టులు పెడుతూ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలుపుతోంది. అలాగే తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటుంది. కానీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం లేదు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాంగ్రెస్ లీడర్ కొండా సురేఖ(Konda Surekha).. సమంత, నాగచైతన్య, నాగార్జున(Nagarjuna)పై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో దుమారం రేపిన సంగతి తెలిసిందే.

ఈ వివాదంపై సినీ సెలబ్రిటీలంతా సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వ్యవహారంపై నాగార్జున(Nagarjuna) చట్టపరంగా పోరాడాలని నిర్ణయించుకుని కేసు కూడా పెట్టారు. అంతేకాకుండా కొండా సురేఖపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా కూడా వేశారు. కొండా సురేఖ కామెంట్స్‌తో సమంతకు ప్రేక్షకుల్లో సానుభూతి ఏర్పడింది. అయితే ఈ క్రమంలోనే సిటాడెల్ ట్రైలర్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించి సమంత సానుభూతి క్యాష్ చేసుకోబోతుందని నెట్టింట చర్చలు జరుగుతున్నాయి.

Next Story

Most Viewed