మెగా కోడలు కాబోతున్న మరో టాలీవుడ్‌ బ్యూటీ ?.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన న్యూస్..!

by Kavitha |
మెగా కోడలు కాబోతున్న మరో టాలీవుడ్‌ బ్యూటీ ?.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన న్యూస్..!
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ రీతూ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా శ్రీ విష్టు హీరోగా నటించిన ‘స్వాగ్’ మూవీలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ సందీప్ కిషన్‌తో కలిసి ‘మజాకా’ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలోనూ ఒక క్రేజీ ప్రాజెక్టులోనూ నటిస్తోంది. ఇలా తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ సంపాదించుకోవడానికి ట్రై చేస్తోంది ఈ బ్యూటీ. అయితే ఈ ముద్దుగుమ్మ మెగా ఫ్యామిలీలో ఎక్కడ ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా హాజరవుతుంది.

మెగా కుటుంబంలో రీతూ వర్మకు అంత మెరుగైన సంబంధాలు ఎలా ఉన్నాయి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే మెగా హీరోను ఈ భామ ప్రేమించడం కారణంగానే వారి ఇంట్లో జరిగే అన్ని వేడుకలకు వెళుతుందని సోషల్ మీడియాలో పలు పుకార్లు నెట్టింట షికార్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారని, త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతుందని టాక్ వినిపిస్తోంది.

అయితే ఆ మెగా హీరో ఎవరు అనే విషయం మాత్రం సస్పెన్స్‌గా ఉంటుంది. ఇక ఒక్కొక్కరు ఒక్కో మెగా హీరో పేరు చెబుతున్నారు. ప్రస్తుతం మెగా కుటుంబంలో పెళ్లి కాకుండా మిగిలి ఉన్న హీరోలు ఎవరు అంటూ కొంతమంది లెక్కలు కూడా తీస్తున్నారు. ఫలానా హీరో అని ఒకరు అంటుంటే కాదు ఈ హీరోనే అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. మరి రీతూ వర్మ ప్రేమించే మెగా హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది. కాగా ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story