Uttar Pradesh: పార్లమెంటు భవనం దగ్గర ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మృతి

by Shamantha N |
Uttar Pradesh: పార్లమెంటు భవనం దగ్గర ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో పార్లమెంట్ భవన్(Parliament) దగ్గర ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బాగ్‌పత్ కు చెందిన జితేంద్ర అనే వ్యక్తి రెండ్రోజుల క్రితం పార్లమెంటు భవనం దగ్గర ఆత్యహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాగ్‌పత్‌లో అతని కుటుంబంపై రెండు కేసులు నమోదైన కారణంగానే కలత చెంది సూసైడ్ చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే, ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఆత్మహత్యాయత్నం తర్వాత జితేంద్రను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారు. బాధితుడిని వెంటనే రామ్ మనోహర్ లోహియా(RML hospital) ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి పెట్రోలు స్వాధీనం చేసుకున్నారు. జితేంద్ర పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకున్నాడని...అందుకే అతని శరీరం చాలా ఎక్కువ భాగం కాలిపోయిందని అధికారులు చెప్పుకొచ్చారు. ఈ ఘటన తర్వాత పార్లమెంట్ ముందు భద్రతా సిబ్బందిని మోహరించారు. ఇకపోతే, 95 శాతం కాలిన గాయాలతో శుక్రవారం తెల్లవారుజామున 2.23 గంటలకు జితేంద్ర చనిపోయినట్లు అధికారులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం జితేంద్ర మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed