రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి శ్రీవాణికి గాయాలు.. కన్నీరుమున్నీరవుతున్న భర్త, కూతురు(వీడియో)

by Kavitha |
రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి శ్రీవాణికి గాయాలు.. కన్నీరుమున్నీరవుతున్న భర్త, కూతురు(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై ఎంతో పాపులారిటీ ఉన్న నటీమణులలో శ్రీవాణి ఒకరు. చంద్రముఖి సీరియల్ ద్వారా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న ఈమె విక్రమాదిత్య అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తన భర్త ఈవెంట్ ఆర్గనైజర్ అండ్ మానేజర్‌గా పని చేస్తున్నారు. ఈ అమ్మడు ప్రస్తుతం మేడమ్ అంతే అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరై సందడి చేస్తున్నారు. కాగా వీరికి నందిని అనే పాప కూడా ఉంది.

ఇదిలా ఉంటే.. నటి శ్రీవాణికి రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఈ విషయాన్ని శ్రీవాణి భర్త విక్రమాదిత్య ఒక వీడియోలో చెప్పుకొచ్చాడు. త్రీ డేస్ బ్యాక్ శ్రీవాణి అండ్ ఫ్యామిలీ చీరాల బీచ్‌కి వెళ్తుండగా శ్రీవాణి వాళ్ళ అమ్మ వెళ్తున్న కార్‌కి యాక్సిడెంట్ అయినట్టు చెప్పాడు. నుదిటి మీద చీరుకుపోవడంతో పాటు రైట్ హ్యాండ్‌కి ఫ్రాక్చర్ అయినట్టు చెప్పాడు. అయితే శ్రీవాణిని గుంటూరులోని ఒక హాస్పిటల్‌లో చేర్పించామన్నారు. అలాగే ఆమె నుదురు మీద బాగా డీప్‌గా కట్ అయిపోవడంతో కుట్లు కాకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయాలని హాస్పిటల్ వాళ్ళను కోరామన్నారు. ఎందుకంటే షూటింగ్ టైం అక్కడ మార్క్ కనిపిస్తుంది కాబట్టి స్టిచెస్‌ వద్దు అన్నారట.

అయితే అంత డీప్‌గా చర్మం తెగిపోయింది కాబట్టి వాటికి స్టిచెస్ మాత్రమే వేయాలని ప్లాస్టిక్ సర్జరీ పనికి రాదని డాక్టర్స్ చెప్పారంటూ విక్రమాదిత్య చెప్పారు. అలాగే శ్రీవాణి త్వరగా రికవరీ కావాలంటూ విష్ చేయాలని అందరినీ ఈ వీడియో ద్వారా కోరుకున్నారు. ఇక యాక్సిడెంట్ అయినప్పుడు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వాలన్నారు. అక్కడికి వెళ్తే తమ పరిధి కాదన్నారని చెప్పాడు.

అలాగే తామిద్దరం కలిసి కొత్త కొత్త డెసిషన్స్ తీసుకున్నామని అలాగే ఇద్దరూ కలిసి భార్యాభర్తలుగా ఒక సీరియల్‌లో నటించడానికి కమిట్ అయ్యామని చెప్పాడు. ఇలాంటి గుడ్ న్యూస్‌లు విన్న ఈ టైములో ఇలాంటి ఒక సంఘటన జరిగింది అని బాధపడ్డారు. ఇక తమ కష్టం చూసిన వాళ్లంతా మీ మీద ఉన్న అందరి దిష్టి పోయింది. కంగారు పడకండి అన్నారంటూ చెప్పాడు. అలాగే ఆ వేంకటేశ్వరుడి దయ వలన ప్రమాదం నుంచి బయటపడ్డామంటూ ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నారు విక్రమాదిత్య. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు.. శ్రీవాణి త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

(video link credits to madam anthey youtube channel)

Next Story

Most Viewed